నలుపు
నాకు నచ్చిన కలర్ నలుపు… ఎందుకో తెలియదు నాకు నలుపంటె చాలా ఇష్టం కానీ మా అమ్మ నన్ను నలుపు వేసుకోనిచ్చేది కాదు.. నలుపు నాకు అచ్చి రాదని చెప్తుండె.. అందుకని ఎప్పుడూ నలుపు బట్టలు కూడా వేసుకోలేదు..
ఇప్పుడేమో అమ్మ లేదు వద్దనే వాళ్లు లేరు నా ఇష్టమైన నలుపు బట్టలన్నీ వేసుకుంటున్న.. కానీ వేసుకునే ప్రతిసారీ అమ్మే జ్ఞాపకం వస్తది అమ్మ మాటే గుర్తొస్తది.. పెళ్లయ్యాక మా వారు కొనిచ్చారు ఏం కాదులే! ఇప్పుడు నువ్వు వేరే ఇంటి అమ్మాయివి మాకా పట్టింపులు లేవులే! అని అలా నా నలుపు కోరిక తీరింది కానీ అమ్మ జ్ఞాపకాలు మాత్రం పోవండి..
ఒక సారి మా అమ్మకు తెలియకుండా మా అక్క క్రీం కలరుకు నల్ల బార్డరు ఉండే లంగా నల్ల ఓణి నల్ల జాకెట్ కుట్టించింది
కానీ అస్సలు వేసుకోనీయకుండా మా చాకలమ్మ ముత్తి బిడ్డకు ఇచ్చేసింది.. మా అక్క ఎంత బతిమాలిందో! దానికి ఇష్టం అమ్మా! వేసుకోనీయ్ అని..
అలా మెుండిగా మా అమ్మ ఉండే సరికి నాకింకా నలుపు పై ఎక్కువ మక్కువ పెరిగింది.. అదండి నా నలుపు కలరు స్టోరీ!
– ఉమాదేవి ఎర్రం