నాలుగు పాదాల ధర్మం
ఎక్కడుందండి
నాలుగు పాదాల ధర్మం
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో,
రెండు పాదాలు సరిపోక ,రెండు చేతులను
పాదాలకు సమంగా కూడా ఉపయోగిస్తూ
నాలుగు వ్యవహారాలలో తలదూర్చుతూ
ఒక కాలు ఒక వ్యవహారంలో మరొక కాలు మరో వ్యవహారంలో
చేయి ఇంకో వ్యవహారంలో
మరో చేయి మరో వ్యవహారంలో
పెట్టి ధర్మం పక్కన పెట్టి అవినీతితో
డబ్బు నాలుగు పాదాల నుండి రావాలని
ఆశిస్తూ తమను తాము మరిచిపోయి
డబ్బు పోకడతో అహంకారం తలకెక్కి
ప్రేమ ఆప్యాయత పెద్ద చిన్న వినయ
విధేయతలు అనే నాలుగూ పాదాల ధర్మం
మరిచిపోయి చాలా కాలం అయింది.
-బేతి మాధవిలత