నాలుగు పాదాల ధర్మం
సత్యం న్యాయం ధర్మం నిజాయితీ , ఇవన్నీ ఒక కాలంలో ఉండేవి. అయితే రాను రాను సత్యం వధ, ధర్మం చేర అని కాలంతో పాటు మార్పులు వచ్చాయి.
సత్యం మాట్లాడిన వాడిని పిచ్చివాడిగా జమ కడుతున్నారు. న్యాయం మాట్లాడిన వారిని నరికి పోగులు పెడుతున్నారు. ధర్మం చెప్పిన వారిని దాచేస్తున్నారు . ఇక నిజాయితీగా ఉన్న వారిని కారు ఆక్సిడెంట్ లో చంపేస్తున్నారు.
ఒక పోలీస్ ఆఫీసర్ అది ఆడ లేడీ పోలీస్ ఆఫీసర్ మీటింగ్ కి న్యాయానికి ధర్మానికి నిజాయితీకి కట్టుబడి ఉన్న ఆఫీసర్. ఎంత పెద్దవాడైనా వాడు తప్పు చేశాడు అని పిలిస్తే తెచ్చి జైల్లో వేసే వరకు నిద్రపోని ఒక మంచి ఆఫీసర్. ఎంత ఎంత గొప్ప ఆఫీసర్ అంటే తనకు కాబోయే భర్త తనని మోసం చేశాడు అని పెట్టించిన ఆఫీసర్ ఆవిడ లేడీస్ సింగం లేడీ టైగర్ అని పేరు తెచ్చుకున్న జిన్నత్ రొనత్ , రాజకీయ నాయకుడైన పెద్ద బడా బాబులైన తప్పు చేశారు అని పిలిస్తే చాలు ఆధారాలన్నీ సేకరించి వారిని జైల్లో చిప్పకూడు తినేలా చేసేది.
కానీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం అంటే ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటున్నారు. అలాంటి ఆమెను కావాలని ప్లాన్ చేసి కొన్ని కేసులలో ఇరికించారు. ఆ తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత సస్పెండ్ లో ఉన్న తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగోలేదంటూ హాస్పిటల్లో ఉంచారు. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసి విడుదల చేసి ఆమెపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు.
సస్పెన్షన్ నుంచి ఎత్తివేసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తిరిగి తన డ్యూటీలో చేరింది. చేరిన వారం రోజులకే ఆమె ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె ఒక్కరే ఆ కార్ లో ఉన్నారు ఇంకెవరూ లేరు. కారు ఉన్నప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు కార్లో బెలూన్స్ ఉంటాయి అవి దాదాపు కాపాడతాయి.
కానీ ఇక్కడ బెలూన్లు తెరచుకోలేదు కారు మొత్తం నుజ్జునుజుగా అయింది. ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా చితికిపోయింది. అంతటి ఘోరమైన యాక్సిడెంట్ జరగడం ఇదే మొదటి సారి అని అక్కడి ప్రజలు అన్నారు.
ఇదంతా కావాలని ప్లాన్స్ ప్రకారం తమను జైల్లో పెట్టించిన తన కాబోయే భర్త చేయించొచ్చు. లేదా బిజినెస్ మాగ్నెట్స్. రాజకీయ నాయకులు. ప్లాన్ ప్రకారం గా చేసి ఉండవచ్చు. అనే అనుమానాలు కలుగుతున్నాయి.?
పాపం ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి ? తాను మనసా, వాచా, కర్మణా, తన ఉద్యోగంలో చేరినప్పుడు చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని అనుకోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు.
సత్యాన్ని పలకవలెను, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నీతి, నిజాయితీ లతో ఉండాలి అని పోలీసులతో ప్రతిజ్ఞ చేపిస్తారు. ఆమె చేసింది అదే, అంతే తప్ప ఆమె చేసిన తప్పేమీ లేదు.
దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ కలికాలంలో ధర్మం నాలుగు పాదాల పైన నడవడం లేదు. అనేది చాలా బాగా అర్థమవుతుంది. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అంటున్న వాళ్లకి చావులు. అవేవీ లేకుండా ఎవరు చెప్పినట్టు వారు వింటే సూట్ కేసులు అందుకోవడం గొప్పగా మారింది.
ఈ నాలుగు పాదాలు అంటే సత్యం, న్యాయం, ధర్మం ,నిజాయితీ, ఇవేవీ సరిగ్గా లేనప్పుడు, న్యాయంగా ఎవరు ప్రవర్తించినప్పుడు, ధర్మంగా ఎవరూ పాలించినప్పుడు, నిజాయితీగా ఎవరూ లేనప్పుడు ,సత్యం మాట్లాడనప్పుడు కలియుగాంతం కలిగి తీరుతుంది.
అంటే ఒకరినొకరు చంపుకుని కలికాలం అనేది ముగుస్తుంది. అందుకు ఉదాహరణలు చాలా చెప్పవచ్చు. భార్య, భర్తను చంపడం, కొడుకు తల్లిని చంపడం ,కూతురు తండ్రిని చంపడం, సహజీవనాలు, పెళ్లి కాకుండా తల్లి అవ్వడం, తండ్రి ఎవరో తెలియక పోవడం, ఆరేళ్ళ పిల్లను రేప్ చేయడం, అదే ఆరోక్లాసు పిల్ల తనకు తానె డెలివరి చేసుకోవడం ఇలా ఎన్నో కలియుగాంతానికి సూచనగా మనం భావించవచ్చు.
ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇప్పుడే అంటే ఈ పోస్టు పెడుతున్న సమయానికి అమెది యాక్సిడెంటు కాదు ,హత్యా అని తేల్చారు పోలీసులు, ఆమె ఒంటి పై కొట్టినట్టు గాయాలు కనిపించాయి అంట, అంటే ఆల్రెడీ చంపేసి, యాక్సిడెంటు గా నమ్మేలా చేసారు, ఉత్తర ప్రదేశ్ లో జరిగింది ఇది ,మీరు కావాలంటే యు ట్యూబ్ లో చూడొచ్చు.
-భవ్య చారు