నాలో నేను
నాలో నేను తెలుసు కున్నది రవ్వంత
తెలుసు కోలేనిది కొండంత
ప్రతిరోజూ అంతరంగాన్ని ప్రశ్నించుకో
నీవంటేనీకు తెలుస్తుంది మరి
ఎద లోపలి గది తలుపులు
తీసి చూస్తే
మనసు మౌన గీతమై
పాడుతుంది
కనుల కాంతుల కు తెలుసు
నిజమేదో అని
ఊగిసల ఊహలు ఆపుకో
నిన్ను నీవుగా తీర్చి దిద్దుకో
కాలం రంగుల రాట్నం అని
తెలుసుకో
మాటనుమంత్రంగా మార్చకో
అవకాశాల హర్మ్యాలు కట్టుకో
సమస్యల సంఘర్షణ చూసుకో
ఆశించని ఆరాధన
నేర్చుకో
ఆశల హద్దులు రాసుకో
అనుభవాల సాంగత్యం
పట్టుకో
నీతిని నీ అండన ఉంచుకో
పరిమళాల విరజాజులు
చుట్టుకో
అందని ఆవేదన తగ్గించుకో అందినన్ని అద్భుతాలు
సృష్టించుకో
ఒంటరి భాటసారి గా
ప్రేమ ప్రయాణం తేలిక
అనునిత్యం ఆత్మానందం
పొందుతూ
నాలో నేనుగా రా రాజుగా
బ్రతకడం వుందిగా మరి …
– జి జయ