నల్లని కాంతులు (కొత్త వ్యక్తం ) ఎవరు గొప్ప?

నల్లని కాంతులు (కొత్త వ్యక్తం ) ఎవరు గొప్ప?

ఏదైనా సినిమా లో ఒక మంచి హాస్య సన్నివేశానికి మనము ఎలా విరగబడి నవ్వుతామో, నేనూ ఈ ప్రశ్న వేసుకుంటే ఇగ విరగ, విరగే. మానవుడిగా పుట్టడం గొప్ప, కానీ నా ఉద్దేశ్యం లో మానవుడు గొప్ప కాదు.

గొప్పతనం కేవలం స్వీయ పొగడ్తలో భాగం మాత్రమే. తనని తాను గొప్పగా అభివర్ణించుకునే వాడు ఎదుటి వాడిని చులకనగా చూస్తాడు. ఇహ, ఎక్కడినుంచి వస్తుంది వాడిలో గొప్పతనం. నీవు శ్వాసిస్తావు మరియు నీ ఎదుటివాడూ శ్వాసిస్తాడు. మరి, నీలో గొప్పతనం ఎక్కడనుండి వొచ్చింది?

ప్రాపంచిక సుఖాలకి నీవు దగ్గిర, వాడు దూరం. నీవు విలసిల్లు తావు, వాడు విలపిస్తాడు. భాషా భాగాలలో ఇద్దరికీ ఒకే నామము. కాకపోతే, నీకు గొప్ప అనే నానార్డాలన్ని చేరుతాయి వాడికి, గొప్ప యొక్క వ్యతిరేక అర్ధాలు చేరుతాయి.

అభం, శుభం తెలియని రోజుల్లో అతను పుట్టాడండి. వాడి పుట్టుక గొప్పే – అతని జీవిత నౌక ఇప్పటికీ అలానే సాగుతోంది. కాకపోతే, అతని జీవితానుభావాలు పేదకి గల నానార్దాలన్ని వాడికి బిరుదులుగా ఇచ్చేసాయి.

ఆ రోజుల్లో పుట్టాడు కాబట్టి అభం, శుభం తెలియదు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆనాటి  పరిస్థితులకి అనుగుణంగా అవే లక్షణాలు ఉన్న ఒక అమ్మయిని ఇచ్చి పెళ్లి చేశారు, తల్లితండ్రులు.

ఈ రెండు మూగజీవులు కసాయిని నమ్మిన మేకలు అయ్యాయి పాపం. పెళ్ళికి ముందు వాడి తల్లితండ్రులు వాడికి ఇచ్చిన హామీని దాటేసారు. “నీ సొంత జీవితం నీవు ప్రారంభించు” అని దాదాపు తలుపులు తెర్వకపోయినా తెరచి వాకిలి చూపినట్టుగా చెప్పేసారు.

పాపం, ఈ పిచ్చి సన్నాసి మెడలో తాళికట్టిన పుణ్యానికి, భార్య మెడలో డోలైకూర్చుంది. ఇద్దరి ప్రయాణం బ్రతుకు ఓడపై సాగటం ప్రారంభింది. పల్లెల్లో ఉద్యోగాలు శూన్యం కాబట్టి వీరిద్దరూ పట్నం చేరారు.

ఇక్కడ, పేదకి వ్యతిరేకర్ధాన్ని ఇచ్చే గొప్ప వ్యక్తి ఇంట్లో ఆశ్రయం పొందారు. పాలుకారే పసి జంట వారిది. వాడు ఉద్యోగాన్వేషణలో పడ్డాడు. వాడి పూజల ఫలితంగా కాబోలు నెలకు రూ.750/- జీతమొచ్చే ఉద్యోగం దొరికింది. కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషపడింది ఆ అమాయకపు జంట.

వీడు భార్యకి నిత్య పూజారి కాకపోయినా, దేవుడికి నిత్య పూజారి అయ్యాడు. తన ఉద్యోగానికి దేవుడి కరుణ కారణమనుకున్నాడు. ఇలా మూడు, నాలుగు నెలలు గడచిపోయాయి.

ఆ ఆశ్రయం ఇచ్చిన ఆయాసవంతురాలు వాడి చెవిలో శంఖం ఊదేసింది. పాపం చేసేదిలేక దిక్కుతోచని స్థితిలో గ్రామంలో మూసివున్న పుట్టింటి ద్వారాలు తట్టేసాడు.

ఇంతకీ, ఆ రోప్పుల జీవి పూరించిన శంకారావం ఏమిటంటే, “చూడు, తమ్ముడా నువ్వు మా ఇంట్లో పూజ చెయ్యడం అగర బత్తులు, దీపం వెలిగించడం నీ బావకి అస్సలు సహించదు. మానెయ్యి లేదా “వాకిలి చూపించేసింది” ఇప్పుడు, చెప్పండి గొప్పతనం అంటే….! లేదా ఒక చక్కటి హాస్య సినిమా చూసేయండి.

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *