నల్లతోలు
ఎండలో ఆడుతుంటే…. నలుపెక్కి పోతావని కొట్టింది అమ్మ
చిన్నవాడిన చితకవాడిన అందుకే పెట్టాను బుంగమూతమ్మ……
అలక మీదకెక్కి అన్నాను ఇక మాటడానమ్మ
అరెరే ఏమైంది…? హరీ పిడుగా అల్లరి బుడుగా అంది వంగిన నడుమును వంచి బామ్మ….
మలేమో బామ్మ….ఎండలో తిరిగి నలుపెక్కితే…
సిగనాతో పెళ్లి చేయానని…చెప్పింది అమ్మ
తెల్లగా ఉంటేనే అందమన్నది…. నలుపు
అందవిహీనమన్నదమ్మా ఆ రాధమ్మా….
అట్లగాయితే రాములోరి గుళ్లో నువ్వు చెప్పిన
హనుమంతుడు సముద్రాలు దాటినా తెల్లగా ఉన్నాడేమీ? అని నా చిట్టి బుర్ర ఆలోచనమ్మా
వాడి ప్రశ్న విని ముక్కునా వేలేసి….
బుడుగా హరీ పిడుగా… నలుపు నారాయణుడు మెచ్చురా…రాములోరు కృష్ణులోరు నలుపెనన్నది
నలుపే అందమన్నది బోసి నవ్వుల బామ్మ….
అనక మొట్టికాయలు వేసింది…. నాకు కాదోయమ్మా…అవి తిన్నది మాయమ్మా రాధమ్మా….
అందుకే కొన్నాను నల్లనల్లని కాటుకమ్మ….
ఇచ్చాను సిగనాకు… అద్దంలో దిద్దుకుని వచ్చిందమ్మా…. చూద్దును కదా
అందం సంగతి దేవుడెరుగు… కాటుక కళ్ళతో ఇది చంద్రముఖే బామ్మ….
– సాయిప్రియ బట్టు