నాకు నచ్చిన రంగు

నాకు నచ్చిన రంగు

 

నాకు చాలా ఇష్టమైన రంగు యాష్ కలర్ (బూడిద రంగు) ఈ కలర్ అంటే ఎంత ఇష్టమంటే ఎక్కడ చూసినా దానిని వెంటనే అట్రాక్ట్ అవుతూ ఉంటాను. చాలావరకు మా ఇంటిలోని వస్తువులన్నీ గ్రే కలర్ లోనే ఉంటాయి. సోఫాస్,
డోర్ మాట్స్, బెడ్ షీట్స్ కర్టెన్స్ ఇలా ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.

ఇక నా వార్డురోబ్ గనుక తెరిస్తే డ్రెస్సెస్ ,సారీస్, నైటీస్ మూడంతుల భాగాన్ని ఆక్రమిస్తాయి బూడిద రంగు తో. షాపింగ్ వెళ్ళినప్పుడు చూడగానే నన్ను అట్రాక్ట్ చేసే కలర్లలో ఇది మొదటిది.

నాకు తెలియకుండానే అవే కలర్స్ ను మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు మళ్లీ అదే కలరా అని విసుక్కోవడం పరిపాటి. ఇక యాగ్సేసరీస్స్ సంగతి చెప్పనవసరం లేదు బ్యాగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చెప్పల్స్ ఇవన్నీ కూడా ఇష్టపడతాను.

ఈ బూడిద రంగు ప్రాముఖ్య్యాన్ని తెలుసుకోవాలంటే దేవీ నవరాత్రులలో ఆరవ రోజు రంగులు బూడిద రంగులో ఉంటాయి. ఆరోజు ఈ రంగులతో కాత్యాయని దేవిని పూజిస్తారు.

మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఈ కలర్లను ఇష్టపడే వాళ్ళు సమతుల్య భావోద్వేగాలను కలిగి ఉంటారు. అంటే వీరు తటస్థ వైఖరిని ఇష్టపడతారు. బయటి ప్రపంచంలో నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఎటువైపు మొగ్గకుండా మధ్యలో ఉండే తటస్థత అనే దుప్పటిలో తమను తాము కవర్ చేసుకుంటారు.

ఇంకా ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు ఎంత ఎదిగినా ఎదుగుదలతో సంబంధం లేకుండా ఒదిగి ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రంగుని ఇష్టపడేవారు సాధారణంగా భావోద్వేగభరితమైన మనస్తత్వం, సున్నితస్వభావం కలవారుగా అంతర్ముఖులుగా కనిపిస్తారు.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రంగును ఇష్టపడే వాళ్ళు చాలా వరకు డిప్రెసివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఎక్కువగా నాడీ సంబంధమైన రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. బయట ప్రపంచంలో ఇమడలేరు. నిరాశ వాద దృక్పథాన్ని అనుసరిస్తారు.

మీరు ఎక్కువగా కలలు సాహిత్యమునందు ఆసక్తి కలవారే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. పదిమందిలో ఉన్నప్పుడు కూడా తమను తాము ఒంటరిగానే భావించుకుంటారు. సమతుల్య జీవనశైలిని మరియు యధాస్తదాస్థితిని కొనసాగించడానికి ఇష్టపడతారు.

ఎవరినీ నొప్పించని మనస్తత్వం వీరు రిజర్వుడ్గా ఉండడమే కాకుండా ఎదుటివారు ఏ విషయంలోనైనా నిస్సందేహంగా నమ్మదగిన వ్యక్తులు.

ఇవన్నీ నేను చెప్పినవి కాదండోయ్ మనస్తత్వాన్నిపుణులు ఈ రంగును ఇష్టపడే వారి అంతర్ముఖాన్ని లోతుగా పరిశీలించి విశ్లేషించిన విషయాలు.

 

-మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *