నాకు నచ్చిన ప్రదేశం ఈ హైదరాబాద్ లో

నాకు నచ్చిన ప్రదేశం ఈ హైదరాబాద్ లో

ఈ హైదరా బాద్ లో నచ్చని ప్రదేశం ఏమైనా ఉంటుందా ఉండదు. అలా అని ఒక్కటే చెప్పలేము ,ఇక నచ్చిన ప్రదేశం అయితే ముందుగా జూ పార్క్, అవును మీరు విన్నది నిజమే నాకు నచ్చిన ప్రదేశం జు పార్క్ .నేను మొదటగా చూసింది అదే ప్రదేశం కాబట్టి, అందులో ఉన్న జంతువుల సంగతి ఎలా ఉన్నా పచ్చని చెట్ల తో ఎంతో అందంగా ,ప్రశాంతంగా కనిపించే ప్రదేశం , మొదటి సారి మా పాఠశాల పిల్లలతో పాటు వెళ్ళాను, అక్కడే ఉండాలి అనిపించింది. నిజంగా మనుషుల కన్నా జంతువులు ఎంతో ప్రేమను పంచుతాయి వాటికి స్వార్థం తెలియదు కాబట్టి మలినం కానీ మనస్సు తో స్వచ్చంగా ఉంటాయి.

సరే విషయం అది కాదు కాబట్టి నేను మా. పాఠశాల పిల్లలతో వెళ్ళినప్పుడు మొదటిసారి నా ఫోన్ పోగొట్టుకున్నాను. ఆ సందడిలో ,హడావుడి లో ఎప్పుడు పడిపోయింది తెలియలేదు , సరే అనుకుని తిరిగి వచ్చేసాము. అలా రోజులన్నీ గడిచిపోయాయి.

మళ్లీ సంవత్సరంలో అదే రోజు పిక్నిక్ ప్లాన్ చేసి మళ్ళీ పిల్లలతో పాటు నన్నూ పంపించారు. ఈ సారి కొత్త ఫోన్ తో వెళ్లిన నాకు మళ్లీ చుక్కెదురు అయ్యింది. రెండో సారి కూడా మంచి తెల్ల ఫోన్ ను మళ్లీ అదే ప్రదేశం లో పోగొట్టుకున్నాను. ఈ సారి ఏడుపు వచ్చింది. కొత్త ఫోన్ కాబట్టి మళ్లీ ఇంట్లో ఎక్కడ తిడతారో అనే భయం తో వాళ్ళకు చెప్పకుండా , నా జీతం లో కట్ చేసుకొమ్మని చెప్పి మా సర్ నీ అడిగితే అచ్చు అలాంటి ఫోన్ కొన్నిచ్చారు తర్వాత నెల నెల జీతం లో కట్ చేసి తీసుకున్నారు. మిగిలిన టీచర్స్ అందరూ ఏంటి టీచర్ ఇలా అవుతుంది మీకు అంటూ అడిగారు.

నాకు భయం వేసింది. నాకే ఎందుకు ఇలా జరగాలి అనుకున్నా ,కానీ తర్వాత ఆలోచిస్తే అర్థం అయ్యింది, ఆ ప్రకృతి తల్లే ఇలా చేసిందేమో అని ఎందుకంటే ఫోన్ వల్ల మనకు ఓరిగిన మంచి ఏమి లేదు. పైగా కళ్ళు , మెడ అన్ని అనారోగ్యాలు మన సొంతం చేస్తుంది అని చెప్తుంది ఏమో అనుకున్నాను. అలా రోజులు గడుస్తున్నాయి.

మళ్లీ ఆ రోజు వచ్చింది. ఈ సారి నేను కాదు పిల్లలను కూడా పంపలేదు.. అలాగే మా సర్ కూడా లేరు.ఎందుకంటే మా సర్ తన పాఠశాలను మరొకరికి అమ్మేసి వెళ్లి పోయారు. పాపం ఆయన కష్టాలు ఏంటో ఎవరికీ తెలియ లేదు. వచ్చిన మేనేజ్మెంట్ ఎన్నో కొత్త రూల్స్ తీసుకుంది. ఆ రూల్ లో భాగంగానే పాత స్టాఫ్ నీ తీసేసి, కొత్తవారి నీ తీసుకోవడం అందులో నేనూ ఉండడం తో అలా పాఠశాల నుండి వీడ్కోలు తీసుకున్నా , ఇంతా చేశాక కూడా నా ఫోన్ మళ్లీ పోయింది అదే పాఠశాల లో ఎవరో కొట్టేశారు.

తెచ్చి ఇవ్వమని ఎంతో బ్రతిమాలాడను,కానీ నాకు అనుమానం ఉన్న వారు మాత్రం కరగలేదు.ఉపాధి ఇచ్చే ఉద్యోగం  పోయాక ఫోన్ ఎంత అనుకుని ఆ పాఠశాల తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ , వదల లేక, వదల లేక వదిలేసి వచ్చాను.

గతమేంతో మధురం. ఆ జ్ఞాపకాలు మధురం , వాటిని గుర్తు పెట్టుకోవాలి అవి మధుర జ్ఞాపకాలు కావాలి కానీ నాకులా చెడు జ్ఞాపకాలనీ మోసుకుంటూ తిరగ వద్దు , అనుకుంటూ మరో కొత్త ప్రంపంచాన్ని వెతుకుతూ నేనూ ముందుకు సాగాను.

ఇంతకీ ఆ రోజు ఏమై ఉంటుందా అనే ఆలోచన మీకు వచ్చిందా , రాలేదా సరే నేనే చెప్తాను . నిజంగా ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ అర్దం కాలేదు నాకు. మీకు అయితే నాకూ చెప్పండి.. ఆ రోజు నవంబర్ 23 , ప్రతి సంవత్సరం నవంబర్ 23 తారీఖు ఖచ్చితంగా నా ఫోన్ పోయేది. ఇదెందుకో నాకు ఇప్పటికీ అర్దం కాలేదు. మీకు అర్దం అయితే చెప్పండి. ఉంటాను..

-భవ్యచారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *