నక్షత్ర మాల
అందమైన ఆకాశంలో
అలజడులు రేపుతూ
వెచ్చని కిరణాల తాకిడి తో
మేనంతా కవ్విస్తూoటే
మది సరికొత్త రాగాలు ఆలపిస్తుంది
మనసంతా మరో రేయి నీ కోరుతుంటుంది
నీ వెచ్చని శ్వాస తగులుతూంది
హృదయమoతా భారమౌతుంటే
సుమాలమాలలు గుండెల్లో గునపాలై గుచ్చుతాయి
ఎద లోతుల్లో ప్రేమనంతా దాచుకోలేక
నక్షత్రమాలను మెళ్ళో అలంకరించుకుని
చిలిపిగా చూస్తున్న నీ దరికి చేరలేక
విరహపు బాధను తాళలేక
నీ సతిని నేనై నా పతివి నీవై
అందరాని ఆ సుదూర తీరాలను
చేరేదెన్నడో నీ ప్రేమ సామ్రజ్యాన్ని ఏలేదెన్నడో…
– భవ్య చారు