నక్షత్ర మాల
నే చూసిన అందాల నగరం
నక్షత్రాల మాలలు ధరించి
కదలకుండా చూడమన్నది
కళ్లు తిప్ప కుoడా చేసింది
ఉన్న చోటునే మరిచేలా ఊహించ మన్నది ఆ నక్షత్రాల
వరుసను చేరి
అప్రయత్నంగా గగనతలంలో
ఆకాశపందిరి నుండి వేలాడినట్టు
సంబరమనిపించే సౌధాలు
అందమైన అద్భుత కట్టడాలు
మనిషి మేధస్సును మెచ్చుకుంటూ నక్షత్రాలన్ని
మిరమిట్లు గొలుపుతూ
అబ్బురపరిచాయిఆహాఅన్నట్లు
చీకటనేదిన లేదుగా మన అనుభూతుల సమాహారoలో
మినుకు మినుకుల ఆకాశపు
హరివిల్లు నుండి వరుస కట్టిన
నక్షత్రాలు కుచ్చి వేలాడ తీసినట్టు…..?
– జి జయ