నాకే రెక్కలు ఉంటే
నా మనసుకి రెక్కలు కట్టుకొని ప్రపంచమంతా విహరించాలని
ఎగిరే పావురంలా ఆకాశం మొత్తం తిరుగుతూ
అందమైన ప్రదేశాలను చూస్తూ
నన్ను నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను
నాలో ఉన్న నీ జ్ఞాపకాలని మర్చిపోతూ
ప్రకృతిలో ఐక్యం అవ్వాలని
అందుకే నాకు రెక్కలు కావాలి
నాకు ప్రకృతి మీద ఉన్న ప్రేమను తెలుసుకుంటూ
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ
తోటి పక్షులతో నేను కూడా ఎగురుతూ ఉంటే
నా ఆనందానికి అవధులే లేవు
అందమైన ఆకాశంలో మెరుస్తున్న తారలను చూస్తూవుంటే
నిశ్చలంగా ప్రవహిస్తున్న సెలయేర్లను చూస్తుంటే వాటితో పాటు మనసు ఉరకలేస్తుంది…
వికసించే పువ్వులను చూస్తుంటే నా చిరునవ్వు నాకు గుర్తొస్తుంది
ఈ జ్ఞాపకాలని ఒక డైరీలో రాసిన సరిపోవు
మధురమైన కోకిల గానం వింటుంటే
మనసుకు తెలియని ఆనందం చేకూరుతుంది
నాకే రెక్కలు ఉంటే ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి ఆలస్యం చేయను
ఆకాశంలో పిట్టల రివ్వు రివ్వున ఎగురుతాను
చూడాలనుకున్న ప్రదేశాలని చూసుకుంటూ
ఇంకా ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుంటూ
నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ
రెక్కలు కట్టుకొని కష్టపడుతూ
నా గమ్యానికి చేరుకుంటాను….
-మాధవి కాళ్ల