నడకే నాదం
వేసేయ్ నాలుగడుగులు
వీచే గాలితో నాలుగు ముచ్చట్లు
రుచికోరే నాలుకకు నాలుగు కాఫీ చుక్కలు
చేసేయ్ ఉదయంతో జ్ఞాపకాల కవాతు
రోజంతా మనుషులతో కుస్తీ
వేకువతో విరబూసే దోస్తీ
అనుభవాల గల్లీలో
అనుభూతుల గస్తీ
అదే మన ఆస్తి కదా
నిస్సార జీవితాన
ఉదయమో కలల కాసారం
వేకువలోకి ప్రయాణం
శరీరానికో కానుక
కినుక వహించక నడకే నాదంగా సాగాలోయ్
– సి. యస్. రాంబాబు