నడకగీతం
పల్లవి
అరుణోదయమును చూసేద్దాం
అవధుల హద్దును చెరిపేద్దాం
వేకువ పూలై వికసిద్దాం
వెన్నెల రేయై పయనిద్దాం
చరణం
అడుగే వేయగ రావోయి
దొరవై జగతిని ఏలేయి
సుఖమింకెక్కడ లేదోయి
అలసత్వాన్నే తీసేయి
చరణం
పదము పదముతో అర్చిద్దాం
పలుకుతేనెలుగ మార్చేద్దాం
వేకువ పండగ చేసేద్దాం
వేదనలన్నీ తీసేద్దాం
చరణం
గాలీ, ధూళిని ప్రేమిద్దాం
ఆలోచనలను కట్టేద్దాం
ఆయాసాన్ని నెట్టేద్దాం
అడుగు అడుగు జత చేద్దాం
చరణం
నడకే తోడని భావిద్దాం
నడిచే దైవం నడకందాం
నడకే నిత్యం శ్వాసిద్దాం
వెలుగు రేఖగా భాసిద్దాం
– సి. యస్. రాంబాబు