నాలోని విరక్తి
మాయ చేసే మగువల మీద
వారి కోసం రాయలేని కవిత్వం మీద
మరుపే లేని నా మనసు మీద
మననం చేయని వారి ప్రేమ మీద
వారి మాయలో లౌక్యం తెలియని
నా మీద నాకెప్పుడూ విరక్తే..,
నా లోని ప్రేమికుడికి ఓ అసంతృప్తి భావనే
ప్రేమ అనే గగనంలో స్వేచ్ఛ విహoగం నేను
బంధి అనే పంజరంలో దుఃఖ సాగర
గంగ ప్రవాహం తను…!
గాయాలన్నీ గేయాలే
గేయాలన్నీ అక్షరకావ్యశ్రీ భావాలే..,
చిరాకు పరాకు చింతలు
చిట్టేడు పుట్టెడు బాధలు
స్వప్నలన్ని క్షణికాలే
క్షణికాలన్నీ సుఖాలే
అందుకే జారిన స్వప్నం చేదిరిన కళలు అక్షరకావ్యశ్రీ విరహ గీతిక విచారణ కావ్యముల్..!
-అక్షరకావ్యశ్రీ..”