నాకు నచ్చిన రంగు

నాకు నచ్చిన రంగు

అన్ని రంగులూ ఇష్టమే, కాకపోతే తెలుపూ, నలుపు కామన్ కానీ నాకు పింక్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏది చూసినా ఆ రంగులోనే చూస్తాను. ఏది కొనాలి అనుకున్నా సరే అదే రంగు లో కొంటాను. కానీ వేసుకోవడం మాత్రం వేసుకోను. అన్ని అలా కొని పెట్టీ చూసుకుంటూ ఉంటాను.

ఇక పోతే నాకు తెలుపు రంగు అంటే చాలా చాలా ఇష్టం, అవి కూడా కొని మోసపోతాను. ఎందుకంటే అవి మనం చూసినప్పుడు ఉన్నట్లుగా ఉండవు. వాటిని భరించే శక్తి మనకు ఉండాలి. లేదంటే ఇక మనం ఎవర్ని భరించలేక ఒంటరిగా మిగిలి పోతాం, ఎరుపు రంగు ఇష్టమే కానీ కోపం వస్తుందని అనుకోను.

ఒకప్పుడు అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు సోమవారం తెలుపు, మంగళవారం పసుపు, బుదవారం బ్లూ నీ, గురువారం నారింజ రంగు, శుక్రవారం ఎరుపు, శనివారం నలుపు లాంటి బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని, కట్టిన చీర కట్టకుండా, ఎవరికీ బోర్ కొట్టకుండా, ఎక్కడ కొన్నావ్ అనేలా ఉండేది మన మైంటనేయిన్స్.

అలా ఒకటి తర్వాత ఒకటి చాలా చీరలు వందల్లో ఇంట్లో ఎక్కడ చూసినా అన్ని రంగుల ప్రపంచం తో కట్టి పడేశాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే నువ్వు కట్టిన రంగుల్ని కాదు చూసేది, నువ్వు మార్చే మాటల హంగులను అని అర్థమయ్యక యే రంగు అయితే ఎంటని అనుకుని సరి పెట్టుకుని కొనడం మానేశా,

మాటలతో జనాల్ని మాయ చేసే రంగుల ప్రపంచం లో నా ప్రపంచం సముద్రం లో ఎంతని అనుకుని ఒకే రంగుని ఇష్టపడడం మొదలు పెట్టాల్సి వచ్చింది. అదేంటో మీకు తెలుసు…. 

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *