నాకు నచ్చిన సినిమా
నాకు నచ్చిన సినిమా దసరా బుల్లోడు. ఈ సినిమా మా ఊరు భట్లపెనుమర్రు లో తీసారు. దసరా బుల్లోడు సినిమా 1971,జనవరి 13వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాకు దర్శకుడు శ్రీ వి.బి. రాజేంద్రప్రసాద్. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు,వాణిశ్రీ, చంద్రకళ,ఎస్. వి. రంగారావు, సూర్యకాంతం, రావి కొండలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు మొదలైన గొప్ప నటీనటులు నటించారు.
ఈ సినిమాను ప్రముఖ సినిమా సంస్ధ అయిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించారు. కె. వి. మహదేవన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుసీల గారు పాడిన ఆ పాటలు ఇప్పటికీ ప్రజల మనసును దోచుకుంటున్నాయి.
చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనే గీతం ఇప్పటికీ మనసును కదిలించి వేస్తుంది. చక్కటి గ్రామీణ నేపధ్యంలో తీసిన సినిమా ఇది. దసరాబుల్లోడు సినిమాలో నాగేశ్వరరావుగారి నటన అధ్బుతం. ఆ సినిమా హిందీలో కూడా రీ మేక్ చేసినా పెద్దగా ఆడలేదు. సినిమా తీసినప్పుడు కొందరు నటులు మా బంధువుల ఇళ్ళలో బస చేసారని అంటుంటారు. మీరు కూడా ఆ సినిమా చూసి ఆనందించండి.
ఆ నాటి ప్రేమ,కుటుంబ కధా చిత్రం దసరాబుల్లోడు. ఈ సమాచారం మా ఊళ్ళోని పెద్దలతో మాట్లాడేటప్పుడు తెలిసింది. ఎందుకంటే అప్పటికి నేను పుట్టలేదు.
– వెంకట భానుప్రసాద్ చలసాని