నా వేదన
చుట్టూ పదిమంది ఉన్నా,
చూడలేకపోతున్నా,
చుట్టూ మాటలు మాట్లాడుతున్నా,
మాట్లాడలేకపోతున్నా,
ఎండలో మాడిపోతున్న,
చెట్టు నీడ కోసం వెళ్లలేక పోతున్నా,
ఈ కాంక్రీటు ఇళ్లల్లో మగ్గిపోతున్నా,
గుక్కెడు నీళ్ల కోసం వెతుకుతున్న,
గుండె మంటతో గొంతెండి పోతున్నా,
ఎవరిని అడగాలో తెలియక అల్లాడి పోతున్నా,
ఎవరిని ఎవరూ పట్టించుకోకుండా,
ఎవరి పనులకు వారు వెల్లుతున్నా,
ఒక్కరూ ఒక్కరూ అయినా ఆగక పోతారా,
నన్ను చూడక పోతారా,
నా ఆర్తీ ని తీర్చలేక పోతారా,
అని నాలో నేను, నాతో నేను,
మదన పడుతున్నా,
కానీ నా లాంటి చిన్న జీవిని,
పట్టించుకునే నాథుడే కరువయ్యారు,
ఈ లోకంలో, ఈ జన జీవన స్రవంతి లో….
-భవ్య చారు