నా తెలుగు

నా తెలుగు

నా తెలుగు
అమ్మ పిలుపులోని “కమ్మదనంలో “
నా తెలుగు
నాన్న ఇచ్చే “భరోసాలో “
నా తెలుగు
చెల్లి చూపే “ప్రేమలో “
నా తెలుగు
అక్క పంచే “ఆప్యాయతలో “
నా తెలుగు
తాతయ్య “కుస్తీ పట్లలో “
నా తెలుగు
నానమ్మ “చందమామ కథలలో “
నా తెలుగు
వేడి వేడి “ఆవకాయ రుచిలో “
నా తెలుగు
ఏమని చెప్పను ఎలా చెప్పను ఎంతని చెప్పను
నా తెలుగు గురించి
నాటికి నేటికి ఎన్నటికి ఎప్పటికి
ఎల్లప్పటికీ అనుబంధాల బంధాలలో
నా తెలుగు
వేవేల వెలుగులు వెలుగుతూనే వుంటుంది.
– అంతటి వీరబాబు

0 Replies to “నా తెలుగు”

  1. మాటలు రావట్లేదు నీ ప్రతిభ ని వర్ణించడానికి. చాలా చక్కగా చెప్పావు మిత్రమా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *