నా ప్రియమైన

నా ప్రియమైన 

 

ఇక్కడ నేను పేరు ఎందుకు రాయలేదు అంటే,
నేను నిన్ను ఇంకా కలిసింది లేదు,
కలుస్తానో లేదో కూడా తెలీదు. విధాత రాసిన నా రాతల్లో ప్రేమ ఉందో లేదో
తెలీదు కదా మరి.
నువ్వు ఎక్కడో ఉండే ఉంటావు అనుకుని
రాస్తున్నా ఈ లేఖ…..!
ముందు చాలామందిని చూసి,
అది నువ్వే అని తలచి,
నాలో ఉన్న ప్రేమను పంచే ప్రయత్నం చేశా.
నేను రాసే ప్రతి కథలో నిన్నే వెతికా,
ప్రతి కవిత నిన్ను తలచే రాశా.
ఈ జనంలో నుండి నువ్వు వచ్చి,
నన్ను వేరే ప్రపంచానికి తీసుకువెళతావు అని చాలా సార్లే అనుకున్నా. ఇప్పటికీ నువ్వు వచ్చి నన్ను కలుస్తావు అనే నమ్ముతున్నా.
నాకు నీ పైన ఉన్న ప్రేమ చెప్పడంకంటే, నా ప్రేమ ఎలా ఉంటుందో వ్యక్తపరచాలి అని ఉంది. అందుకే ఈ లేఖ ఇక్కడితో ముగిస్తున్నా.

ఇట్లు..

నీ ప్రేమకై వేచి ఉన్న నీ నేను….

 

-చైతన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *