నా ప్రదేశం..
ముఫ్పైమూడు సంవత్సరాలు గడిపిన మా ఉధ్యోగ రీత్యా ఉన్న ఊరు ఆ ఇళ్లు ఆ వాతావరణం..స్పెషల్ డి క్వార్టరు అది..ఎంత బాగుంటుందో!నాలుగు రూములు వాళ్లు కట్టిస్తే దానికి ఇంకో రెండు రూములు మేం కట్టుకున్నాం! చాలా పెద్దగా!నా ముగ్గురు పిల్లలూ పెరిగింది అక్కడే!
ఆ ఇంటికి పెద్ద ఖాళీ ప్లేసు కూడా ఇచ్చారు పెరడు లాగా! దాంట్లో నేను రకరకాల చెట్లు పెట్టుకున్నా! నిమ్మ ,దానిమ్మ,జామ,మామిడి,సీతాఫలం,రేగు పండ్లు ఇలా అన్ని పండ్ల చెట్లు అరటి కూడా! కూరకాయలు ,పూల చెట్లతో సహా!
అదొక నందన వనమే! ఇంటి ముందొక వేప చెట్టు పెట్టా! అదొక పెద్ద వృక్షమే అయింది..అలాంటి ప్రదేశం మళ్లీ నాకు దొరకడమే లేదు..అందుకే నాకా ప్రదేశం చాలా ఇష్టం..
-ఉమాదేవి ఎర్రం