నా మగువ
అవును నా మగువ ఎదుగుతుంది
అవునా నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వస్తుంది…..
దేవదాసీలా ఒకరికి దాసిగా ఉండే నా మగువ తన ప్రేమతో ఈ యావత్ ప్రపంచాన్ని తనకు దాసోహం అయ్యేలా మార్చుకుంది
అవును నా మగువ బ్రతుకు ప్రయాణంలో మార్పు వచ్చింది
చితి మంటలు చేర్చే స్మశానవాటికలో ప్రవేశం లేని నా మగువకు ఇప్పుడు ఒకరికి చితిమంటను పెట్టేదాకా నా మగువా ఎదిగింది
అవును నా మగువ మీద ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుంది ఈ సమాజానికి..
పున్నాక నరకం నుంచి కాపాడే వాడు కొడుకు అనే ఆలోచన నుంచి బ్రతుకు ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కష్టం నుంచి కాపాడేది కూతురు అనే వరకు నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వచ్చింది
నాలుగు గోడల మధ్య నలిగే కాలం నుంచి నలుగురికి బ్రతుకు తెరువు చూపేలా నా మగువా ప్రయాణంలో మార్పు వచ్చింది
ఇన్ని మార్పులు వచ్చినా ఎందుకో తెలియదు కొన్ని సార్లు నా మగువా అమ్మ గర్భంలోనే కనుమరుగు అయ్యేలా ఈ సమాజం చేస్తుంది
అవును కొన్నిసార్లు నా మగువకి తోడుగా ఉండాల్సిన ఈ సమాజం తోడేలుగా మారి నా మగువ కనుమరుగయ్యేలా ఈ సమాజం ప్రవర్తిస్తోంది.
బాధ్యతగా ఉండాల్సిన భర్త భారంగా మారితే నా మగువకి ఉరితాడే దిక్కు కదా
అన్నా అని ఆప్యాయతగా పిలుచుకొనే అన్న అనరాని మాటలు అంటే నా మగువకి మరణమే దిక్కు కదా…
తనకు ఎదురయ్యే కష్టాల కంచెను తెంపి కంటికి రెప్పలా చూసుకునే కన్న తండ్రి కంచెలా మారితే నా మగువకు కట్టే దిక్కు కదా..
నా మగువ లేనిది మగాడు లేడు
నా మగువ లేనిదే మానవ మనుగడ లేదు…
– జగదీష్