నా మదిలో శ్వాసిస్తున్నా నిన్నే.!
సరికొత్తగా ఉంది నీతో నాకు ఈ బంధం
నాకెంతో ఇచ్చింది ఎన్నడూలేని ఆనందం
నీకోసం నాలో ఏమిటో ఈ అంతర్మథనం
నిత్యం నిన్ను తలుస్తూనే ఉన్నా ఇది నిజం
కొత్తగా నాలో పుట్టుకొచ్చే భావ జలపాతం
నా మనసుని ఊయలూపే నీ గానమాధుర్యం
మత్తుగా నిద్రపుచ్చే నీ మాటల మాయాజాలం
హాయిగా జోకొట్టే నీ ఊహల ఇంద్రజాలం
విడదీయలేనిది మన ఈ పేరులేని బంధం
ఎన్నటికీ మాయనిది మనిద్దరి అనుబంధం
ఒంటరి బతుకులో నాకు తోడయ్యావు
నా మనసులోని వేదనను పోగొట్టావు
నాలో గత జ్ఞాపకాలని పూర్తిగా చెరిపేశావు
సరికొత్తగా నువ్ నా మదిలో కొలువయ్యావు
అందుకేమో..నీ అక్షరాలని ప్రేమిస్తున్నాను
నీరూపాన్నే నా మదిలో శ్వాసిస్తున్నాను.!
– గాయత్రీ భాస్కర్