నా కలమే
నా సంతోషం నా ఆశ నా శ్వాస నా బలం నా కలమే!
అయ్యెా! ఇప్పుడు కలం కాదు నా ఫోను నా వేలు ఇదే కదా!
ఒకప్పుడు నా బలం నాకలం..
ఇప్పుడయితే నా వేలే!!
పెన్ను పేపర్ల కాలం మారి ఫోను వేలుల బంధం పెరిగింది..
అప్పుడేమెా నా పెన్నుకేమీ కాకూడదు సిరా నిండా ఉండాలనుకునేదాన్ని. ఆ పెన్నులు పోయి రిఫిల్ పెన్నులు వచ్చాక ఆ రిఫిల్లను అప్పుడప్పుడూ ఎండలో పెడుతూ ఎక్స్ట్రా పెన్నులు ఉంచుకునేదాన్ని..
ఇప్పుడేమెా నా ఫోన్ కేమీ కావద్దు. నా వేలుకేమీ కావద్దని కోరుకుంటున్నా!
ఇక సమయం ..
సమయం అయితే అదే అయినా ఆ కాలంలో ఎక్కువ సమయం ఉండేది రాయడానికి మా డాబా ఎక్కి కూర్చుంటె దాదాపు నవల రాసేసేదాన్ని. ఈ కాలంలో ఏమయిందో! ఏమెా! కానీ సమయమే సరిపోవడం లేదు. చిన్న కవితకే పెద్ద తిప్పలు..
కానీ ఏ కాలం ఏమయినా నా బలం మాత్రం నా సాహిత్యమే!!
మీరూ అంతేనా?
-ఉమాదేవి ఎర్రం