నా దేశపు జెండా ఎగరాలి నా దేశపు మువ్వన్నెల జెండా
భారతీయుడి గుండెలో దేశభక్తి నిండా
శాంతి కపోతంలా కనపడే శ్వేత వస్త్రం నా జెండా
కవ్విస్తే రక్త వర్ణపు రంగు పులుముకోకుండా
గణతంత్ర ఘంటారావం ప్రతి గుండెలో మోగగా
శత్రుదేశపు గుండెల్లో మృత్యుగంటికలు మ్రోగవా
ఎల్లువైన దేశభక్తి ఏరులై పారదా
ఎర్రకోటకి గొంతుకొచ్చి జాతీయ గీతం పాడగా
జైహింద్ జైహింద్ అని జన గణ మన పాడదా
జై హింద్
– భరద్వాజ్