నా దేశం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి….
ఆకాశం నిండా
మన భారతీయ జెండా
రెప రెప లాడాలి ఎల్లపుడు
మన మనసు నిండా
ప్రేమ సాగరం…. నా దేశం
విశ్వ కుటుంబం… నా దేశం
పది వేల సంవత్సరాల సంస్కృతి… నా దేశం
శాంతి నిలయం….. నా దేశం
చల్లని చక్కని కాల ప్రవాహం….. నా దేశం
కోటాను కోట్ల త్యాగ మూర్తుల పోరాట ఫలితం
స్వేచ్చ…. స్వాతంత్రాల దేశం…. నా దేశం
భారత మాత ఒడి లో స్వేచ్చా శ్వాసలు
వెచ్చ వెచ్చగా… పీలుస్తూ…..
వజ్ర ఉత్సవాల స్వాతంత్ర సంబరాలు
చేసుకుందాం…. ఇంకా ఉందిలే
మంచి కాలం ముందు ముందున అంటూ అనుకుంటూ….
ఆరోగ్యంగా…. ఆనందంగా ….
కలిసి పోదాం… ముందు తరాలకు
ఆదర్శంగా…..మార్గదర్శులం….
అవుదాం ఆనందంగా……
ప్రియమైన పూజ్యులు,మిత్రులు, అందరికి,
నా హృదయ పూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
– అల్లావుద్దీన్