నా దేశ సిద్ధాంతానికి వందనం
సైనికుడి భుజాల మీద నిలిచినా మువ్వన్నెల జెండా కు వందనం
సర్వ మతాలను
తన ఒడిలో లాలించే
నా భారత మాత కి వందనం
ప్రపంచ దేశాల ముందు
శాంతి శాంతి అంటూ తపించే
నా దేశ సిద్ధాంతానికి వందనం
కులమతాలు ఎన్ని ఉన్నా
మనసులో బావలు ఎన్ని ఉన్నా
దేశం అంటే ఒకటయే
నా పౌరుల దేశ ఐక్యతకు వందనం
చెమట చుక్కలతో
భూ తల్లిని ముద్దాడుతూ
దేశానికి అన్నం పెట్టే
రైతన్న కష్టానికి వందనం
ఎన్ని గాయాలు అయిన
ఎన్ని అవరోధాలు ఎదురైనా
ప్రపంచ దేశాలకు పోటీ పడే
నా దేశ సార్వభౌమాధికారాన్నికి వందనం.
– నడిపి (బాయికాడి నర్సింలు తాడ్వాయి)