నా చెలియా…
ఎదురుచూపులు మది పలుకుతుంది మౌన గీతాలుగా…
ఆశల చిత్రంతో మెదులుతుంది కన్నె కదులుతుంది నా కనురెప్పలలో…
మూగమనసుకు అది చేరునా, ఎదురు చూస్తున్నా మౌనంగానే అలిగి ఉన్నద,
అనుకుంటా మాటే రాకుండా..
నా కన్నులముందు కనబడదా నా కన్య అప్సర
అప్పుడు నా మది కవ్వించదా కవితాత్మకంగా…
ఎదురు చూస్తున్న ఎదురుపడదా బదులుగా నా కన్నులముందు కనువిందుగా…
అలకపాన్పులో శయనించినావా నా చిలక…
నన్ను తిలకించ లేవా నేను ఎదురు చూస్తున్న చూపులు నీకు కనబడలేదా నీ హృదయంలో… భరించలేనే బరువెక్కినదే నా గుండె,
నా గుండె నిండా నీ చిత్రంతో నిండి పోయినదే..
చిత్తంతో ఎదురుచూస్తున్నా నా చెలి లావణ్యం అపురూపం సౌందర్యం, నా ఆశలకు నీళ్లు పోయవులే..
నా కన్నీళ్లే నీ పాదాలను కడుగునులే..
నా ఊహలకు నా ప్రాణ జ్యోతివి నీవేలే
నా చెలియా…
– పలుకూరి