నా ఆలోచన
నా ఆలోచనే నాకు ఒక అందమైన శత్రువు…
అమ్మ అనురాగంతో, నాన్న నడవడితో.. వాళ్ల ఇద్దరి ఆలోచన విధానంతో తొడైనా నా ఆలోచనే నాకు అందమైన శత్రువు…..
మధ్యతరగతి బ్రతుకులో మంచి ఆలోచనే నా శత్రువు….
పెరిగి పెద్దై పాఠశాల పరిచయంలో పాఠాలే నా నేస్తాలు… సొంత ఆలోచనకై ఆశ తోడై – ఆనందం, ఉత్సాహమే నాకు అందమైన శత్రువులు..
చిన్నతనంలోనే చురుగ్గా, సమాజం కోసం సాగాలనే నా పరుగే నా అందమైన శత్రువు..
పరిస్థితుల ప్రయాణాన భయం నేనే, భరోసా నేనే.. బాధ నేనే బాధ్యత నేనే…
నా చురుకుతనంతో నేను సాధిస్తాననే ఆశ రేకేత్తించి, నాన్నకు ఆనందంకు ఆశలు రేపి, కళాశాల కళల లోకానికి బానిస అయి..
నాన్న పెంపకంతో నమ్మకంలో ఉన్న గాని చదువు మీద శ్రద్ధ చూపక, ఆశలను హడి ఆశలు చేసి,
నాన్నను బాధపెట్టా అని నన్ను నేను ద్వేషించిన ఆలోచనా నా శత్రువు…
చదివించే స్థోమత లేక చదివే ఓపిక లేక నాకు నేనే శత్రువుగా మారి నాన్న కష్టాలను చూసి..
నాకు వేరంగా పెళ్లి చేసుకునే ఉదేశ్యం లేకపోయినా..
నాన్నకు నచ్చిన సంబంధం చేసుకొని అత్త ఇంట్లో అడుగుపెట్టిన ఆలోచనే నాకు అందమైన శత్రువు..
– తోగారపు దేవి