నా ఉద్యోగ జీవితం
హైదరాబాద్ నగరానికి రావటమే నా జీవితంలోజరిగిన ముఖ్య సంఘటన.29 సంవత్సరాల క్రితం
ఒక చిన్న ఊరిలో ఉండేనేను ఉద్యోగాన్వేషనలోహైదరాబాద్ వచ్చాను.
హైదరాబాదులో అడుగుపెట్టడం అదే మొదటిసారి. అంతకు ముందు ఎప్పుడూ హైదరాబాద్ నగరానికి వచ్చింది లేదు.
చలికాలంలో ఉదయం పూటలకడీకాపుల్ బస్టాపులో బస్సుదిగినప్పుడు ఒక దేవ లోకంలోకి వచ్చినట్లు ఉంది.అక్కడ ఒక లాడ్జిలో దిగి,ఫ్రైష్ అయ్యి ఇంటర్వూకువెళ్ళాను. ఒక రసాయనిక
కర్మాగారంలో ఉద్యోగం వచ్చింది.
స్టోరు కీపరుగా,టైము ఆఫీసులో సూపర్ వైజరుగా, పర్సనల్ డిపార్ట్మెంట్లో, సిమెంట్
ఏజన్సీలో,ఫ్లోరీటెక్ కంపెనీలో,ఆఖరుకు టీచరుగా చేస్తున్నాను. జీవిత భీమా
సంస్ధలో పార్ట్ టైం ఏజంటుగా పనిచేస్తున్నాను.
పాతికేళ్ళుగాటీచరుగా చేస్తున్నాను. ఇక్కడేసెటిల్ అవ్వాలని ఉంది. మేముఇద్దరం. మాకు ఇద్దరు. ఒక పాప, ఒక బాబు. బాబుకుబెంగళూరులో ఉద్యోగం వచ్చింది.
మా అమ్మాయిఎనిమిదవ తరగతిలో చదువుతోంది. నేను హైదరాబాద్ వచ్చిన మూడేళ్ళకు నాకు
పెళ్ళైంది. నా భార్యతోపైళ్ళైన వేళావిశేషం మంచిదిఅవబట్టి ఇప్పటికీ అంతాబాగానే జరిగింది. రచయితగానా ప్రస్ధానం ఇక్కడే మొదలైంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని