ముత్యాలు
నులివెచ్చని కిరణాల తాకిడికి విచ్చుకున్న పూలు
సుగంధ పరిమళాలను వెదజల్లుతూ దేవుని చెంతకు, స్త్రీల కొప్పున
చేరడానికి నువ్వా నేనా అన్నట్టుగా ఆరాట పడుతున్నాయి…..
సాయంత్రానికి వాడిపోతు కూడా ప్రకృతికి అందానిస్తున్నయి..
నింగిలో చుక్కల్లాగ
భువిపై మెరిసే ముత్యాలు
నిరంతరం కాంతినింపడానికి
వికసిస్తున్నయి
– హనుమంత