ముసలి వారికి అనాథ బ్రతుకు నరకం
అనాథాశ్రమంలో ప్రతి గోడకి తెలుసేమో వారి ఆత్మ ఘోష నరకం..
పడుకునే ప్రతి దిండుకి తెలుసేమో వారి కన్నీటి చుక్కలబరువు నరకం..
పట్టెడు అన్నం పెట్టలేని పుట్టెడు దుఃఖంలో మునిగిన కనుపాల సంద్రానికి తెలుసేమో వారి నరకం..
కాసింత ప్రేమ కోసం తపించే వారి ఎదురు చూసే మనసుకి తెలుసేమో వారి నరకం..
కాటికి కాళ్లు చాపి కోరుకున్న పేగు బంధాల కౌగలింత లేదని ఆ కన్నపేగు ఎక్కి ఏడ్చే అరుపుకు తెలుసేమో నరకయాతన..
చితిమంటకి చేరువుగా ఉన్న ఆహృదయ స్పందన తన తనయుల/తనయురాల్ల గుండెల్ని హత్తుకోవాలని గాఢంగా చూసే ఊపిరి కి తెలుసేమో నరకయాతన…
ప్రాణాలు పోసి ప్రపంచంలోకి పరిచయం చేసిన ఆ తల్లి తండ్రుల ఆత్మల ఆర్థానాథాల స్మశానం లో
ఘోరీలై మట్టి దుప్పటి కప్పుకుని తననెంత బాధ పెట్టిన తన కన్నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటునే
చివరి ఆలోచన తాపాత్రయానికి తెలుసేమో నరకయాతన….
– సీత మహాలక్ష్మి