మురిసే ప్రేమ
(అంశం:ముసిరే చీకట్లు, సన్నని తుంపర ,అతను నడుస్తున్నాడు ,ఎందుకు ?
దేనికోసం)
***
ముసిరే చీకట్లు,
రేపే, మురిసే ప్రేమ కోసం
సన్నని తుంపరకు మనసు
తడపడ అతను నడుస్తున్నాడు ,ఒంటరిగా
అందుకే, దాని కోసమే
అదే, తోడుకోసం ఆలోచనలతో
సాగుతోంది నడక
ఒక చెప్పుతో నడక సాగదు కదా!
తోడు లేనిదే అది జోడు కాదుకదా!
భూమిమీద వున్న
ప్రతి జీవికి అది అవసరం
దానికి మించిన ఆనందం
సృష్టిలో ఏముందనుకొని.
తోడు లేని జీవితం
ఎవడూ కోరుకోడు
భవిష్యత్తుకై వెతుక్కుంటూ
సాగుతోంది వాని నడక
తోడు, నీడ,కూడు గుడ్డ
వీటికోసమేగా మనిషి ఆరాటం
ఆ ముసిరే,ఆలోచనలలో, మెరిసే
భవిష్యత్తు అన్వేషణలో,దానికోసమే
వాని తడపడుతున్న నడక
– రమణ బొమ్మకంటి