ముందడుగు
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన భాను అనే మహిళ ఒక గొప్ప రచయిత అయ్యారు.అసలు కధ విషయానికి వస్తే భాను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఎంతోకష్టపడి పనిచేసి కుటుంబాన్ని
పోషించేవారు. భానుకి ఏ లోటూ లేకుండా పెంచారు.భాను కాలేజీ చదువుపూర్తి చేసుకునేటప్పటికి ఆమె తండ్రి స్వర్గస్తులైయ్యారు. అప్పుడు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారు అయ్యింది. ఆమె పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సంపాదించే నాన్న లేడు. అమ్మేమో బయటకువెళ్ళే స్ధితిలో లేదు. కుటుంబభారం భానుపై పడింది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తనతమ్ముడినీ,చెల్లెలినీ చక్కగా చదివించింది. స్వతహాగా తెలివితేటలు ఉండటంతోఉద్యోగంలో రాణించింది.
భాను చక్కటి కధలు వ్రాసేది.కవితలు కూడా వ్రాసేది. ఆమెఎన్నో పత్రికలకు తన కధలనుపంపేది. ఆమె తన రచనలలోఎక్కువగా అందరికీ ప్రేరణకలిగించే విషయాలే ఎక్కువగావ్రాసేది. ఎంతో మంది పాఠకులు ఆమె రచనలుచదివి ప్రేరణ పొందేవారు.చివరకు ఒక గొప్ప రచయితగాభాను పేరు తెచ్చుకున్నారు. ఈమధ్యనే ఆమె ఒక పత్రిక కూడా ప్రారంభించారు. ఆమె చేసినసాహిత్య సేవను ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇలా ఆమెఎంతోమంది రచయితలకు, పాఠకులకు ప్రేరణగా మారింది.ఆమెను చూసి ప్రేరణ పొందిన ఎంతో మంది మహిళలు వారి జీవితంలో ముందడుగు వేసారు.
ఇది నిజంగా జరిగిన కధలాగేఅనిపిస్తుంది. ఇలాంటి ప్రేరణకలిగించే వ్యక్తులు మన చుట్టూఎంతో మంది ఉంటారు. వారికినా జేజేలు.
-చలసాని వెంకట భానుప్రసాద్
ప్రేరణ కలిగించే మహిళలందరికీ నా ధన్యవాదాలు.