మృత్యు ఒడి
తన ఒడిలో రాబోయే బిడ్డ ప్రాణం కోసం మృత్యువు ఒడిలోకి పోవటానికి సిద్ధమౌతుంది ఆమె.
తన ప్రాణం కన్నా తనకు పుట్టబోయే
బిడ్డ ప్రాణమే ముఖ్యమని మృత్యుదేవతని ఆహ్వానిస్తుంది.
ఒక ప్రక్క తన ఒడి మరొక ప్రక్క
మృతువు ఒడి ఈ రెండిటిని సమాతూకం వెయ్యడంలో సతమతమౌతూ,
ఆ సమయంలో అత్యంత ఆవేదనకు గురౌతుంది ఆమె.
తన బిడ్డచే తను అమ్మా అని పిలిపించు కోవటం కోసం తాను తన అమ్మని అమ్మా!అమ్మా! అని ఆవేదనతో పిలుస్తుంది.
– రమణ బొమ్మకంటి