మోసం
నీతి లేని కొందరు
ధర్మం తప్పి మరికొందరు
మోసం చేయడమే లక్ష్యం
నేటి కాలంలో ఫ్యాషన్ గా మారింది
తీయటి మాటలతో
కల్లబొల్లి కబుర్లతో
నమ్మించి మోసం చేసే
దగాకోర్లతో నిండన సమాజం నేడు
నీతి ని సమాధి చేసి
నియమాలను తరిమికొట్టి
ధర్మానికి అర్థం మార్చి
అధర్మమే అజేయంగా
సాగిపోతున్న నేటి సమాజం
బాగుపడేదెప్పుడు…
నా భారతావని
ధర్మం నాలుగు పాదాలతో
నడిచి పరిఢమిల్లడం ఎప్పుడో..!?
-అంకుష్