మోసం
నిరుపేదలకు ఆశ పెట్టేది
నిరుద్యోగులను కోరిక పెంచి
మధ్యతరగతి వారికి మరో
అవకాశం కల్పించేది.
రాజకీయ సుస్థిరతకు
ప్రాణం పోసేది, చరిత్ర తిరగ రాసేది.
అభ్యుదయ భావాలు కలవారికి
మరో ఆశ కల్పించేది.
భావి తరాలకు కొంగ్రొత్త
ఉత్సహం నింపేది.
ఓటు వేస్తున్నామని
మేము మేజర్లమేనంటూ
గుండెలు ఉప్పెంగెలా
చెప్పుకోగలిగేది.
తమ జీవితాలు
మారతాయని
కొత్త పథకాలతో
తమ బాధలు
తీరతాయనే నమ్మకం తో
తమ బాధలన్నీ రాజకీయ
నాయకులు చెప్పినట్టే
తీరుస్తారని ,
ఇక తమ బతుకులలో
వేన్నెల వెలుగులు నిండుతాయి అని
ఆశ పడుతూ వేలి కి ఇంకు అంటించుకుని
ఓటేసామన్న ఆనందంతో వేలు చూపుతూ
సంతోష పడుతూ ఉంటే ….
నిరు పేదల ఆశలు నీరుకార్చి
నిరుద్యోగుల కోరికలు మంట గలిపి
మధ్యతరగతి వారి మనోభావాలు దెబ్బతీస్తూ
భావి తరాలకు ఉత్సాహం లో నీళ్ళు జల్లి
పథకాలు అన్నిటినీ తమ జేబుల్లో నింపుకుని
రాజకీయ నాయకులు చెప్పిన మాటలు అన్నీ
నీటి మూటలు అని ,తమ బతుకులు ఎన్నటికీ
మారవు అని , అనవసరంగా వేలి కి ఇంకు
అంటించుకుని తప్పు చేశామని వేదనతో
ఇంకెప్పుడూ ఓటు వేయోద్ధు అనుకునే
పిచ్చి జనాలు …మళ్లీ ఓట్ల పండగ రాగానే
అవే ఆశలతో తిరిగి ఓటు వేస్తారు మరో
నాయకుడిని నమ్మి, మోస పోతూనే ఉన్నారు…
-భవ్య చారు