మోసగాళ్ళున్నారు జాగ్రత్త
సమాజంలో మన చుట్టూ మోసగాళ్ళున్నారు. టీనేజ్
యువతను ప్రేమ వలలో
పడేసి ఆ తర్వాత వారిని
అధోగతి పాలు చేస్తుంటారు.
టీనేజ్ యువత తెల్లనివన్నీ
పాలు,నల్లనివన్నీ నీళ్ళు అని
నమ్మేస్తారు. అమాయకంగా
ఉంటారు. టీనేజ్ యువతను
ప్రేమ పేరుతో ఆకర్షించి తమ
పబ్బం గడుపుకునే వారు మన
చుట్టూ ఎక్కువగానే ఉన్నారు.
అది మోసం అని గ్రహించలేక
తమ సర్వస్వాన్ని వారికి సమర్పించుకుంటున్నారు నేటి
యువత. డబ్బునే కాదు
యువత శీలాన్ని కూడా
దోచేసుకుంటున్నారు ఈ
యువత. మోసపోయిన
తర్వాత బాధపడటం తప్ప
చేయగలిగింది ఏమీ లేదు
యువతకు. చేతులు కాలాక
ఆకులు పట్టుకుని లాభం లేదు.
ఈ విషయంలో యువతకు సరైన మార్గదర్శనం చేయాలి.
తల్లిదండ్రులు, గురువులు
యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి
వారికి అవగాహన కల్పించాలి.
అప్పుడే యువతకు చక్కటి
దిశానిర్దేశం జరుగుతుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని
యువత ఎలర్ట్ గా ఉండాలి.