మార్నింగ్ వాక్ ప్రహసనం
మోహన రావుకు మనసులోమార్నింగ్ వాక్ చేయాలనే కసిమొదలైంది. దానికి కారణం
డాక్టరు గారు ఇచ్చిన సలహా. మోహనరావు పొట్ట బాగా పెరుగుతోంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నాలుగు అడుగులు వేస్తే మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు.
నిజంగానే మోహనరావు పొట్ట బాగా పెరిగింది. పైగా ఆయనకు టక్చేసే అలవాటు ఉంది. ఆయన టక్ చేస్తే ఒక కొబ్బరికాయ పొట్ట దగ్గర ఉంది అని అనిపిస్తుంది.సహోద్యోగులు కూడా ఆయనపొట్టను చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.
మంచి రోజు చూసుకుని మార్నింగ్ వాక్ చేద్దామని బయల్దేరాడు. తన ఇంటిమలుపులో ఒక టీ షాప్ఉంది. సరే వాకింగ్ చేసే
ముందు కాఫీ తాగుదాంఅని అక్కడ ఆగాడు.
కాఫీతాగేటప్పుడు అక్కడ ఉన్నరకరకాల బిస్కెట్లు అతన్నిఆకర్షించాయి. బాగా టెంప్ట్ అయ్యి ఒక పాకెట్ బిస్కెట్లు
లాగించేసాడు. తర్వాత తనవాకింగ్ మొదలుపెట్టాడు.
రెండు కిలోమీటర్లు నడిచినతర్వాత మళ్ళీ ఇంటి దారిపట్టాడు. కరెక్టగా ఇంటికి వచ్చేదారిలో ఒక హోటల్ ఉంది.ఆ హోటల్ వాడు రకరకాలదోశలు వేస్తున్నాడు.
మళ్ళీఅక్కడ ఆగి పనీర్ దోశ తినిఇంటికి వచ్చేసాడు. పాపంభర్త వాకింగ్ చేసి వచ్చాడనిఅతని భార్య వేడివేడిగా మళ్ళీ పూరీలు చేసి పెట్టింది.
భార్యప్రేమగా పెట్టిన పూరీలు పూర్తిగా తినేసి, ఆ తర్వాతతయారయి ఆఫీసుకు వెళ్ళాడు. ఇలా కరెక్టగా రెండు నెలలు చేసాడు.
అతనికి పొట్టతగ్గడం పోయి, పొట్ట పెరగడంమొదలైంది. మొదట చిన్న కొబ్బరికాయ అంత ఉన్న పొట్ట గుమ్మడికాయ అంత అయ్యింది. డాక్టర్ చెప్పినట్లుచేసినా పొట్ట తగ్గలేదు అనిడాక్టరు దగ్గరకు మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ఆ రెండు నెలలు ఏలా వాకింగ్చేసావో చెప్పమని అన్నాడు.
మోహనరావు తాను ఎలావాకింగ్ చేసింది వివరంగాచెప్పాడు. అప్పుడు డాక్టర్పకపకా నవ్వి”పొట్ట తగ్గటానికే కదా మీరు వాకింగ్ చేసింది. మళ్ళీ ఇంట్లోనే కాకుండా బయట కాఫీలు, టిఫిన్లు
చేస్తే బరువు పెరగరా.
ఎవరైనావాకింగ్ చేస్తే తగ్గుతారు. మీరేమో బరువు పెరిగారు.ఇక నుండి వాకింగ్ మానేయండి. ఉదయంఒక గంటసేపు ఎక్కువ పడుకోండి.మీకు అదే బెటర్.” అన్నాడు. సహాద్యోగులుకూడా మోహనరావు వాకింగ్
కధ తెలిసి బాగా నవ్వుకునేవారు.
మితృలుకూడా ఎప్పుడైనా కనపడితే“వాకింగ్ కు వెళదామా మిత్రమా” అని నవ్వుతూఅడిగేవారు. మోహనరావుచిరునవ్వుతో రానని చెప్పేవాడు.
-వెంకట్ భానుప్రసాద్ చలసాని