మూగ జీవాలు
ముగా జీవాలు అంటే నోరు లేనివే కాదు .నోరున్న మనుషులు కూడా మూగ జీవాలే అందులోనూ ఆడవారు మరీ నోరులేనివే ఉన్నా కూడా ఏమి అడగకూడదు. ఏమి ప్రశ్నించకుoడదు. ఎవర్ని ఏమి అనకూడదు. ఎవరికి నచ్చినట్టు వారికి మౌనంగా వంట చేసి పెట్టాలి. గట్టిగా నవ్వకుడదు, గట్టిగా మాట్లాడకుండదు. గట్టిగా నడవకూడదు. సున్నితంగా ఉండాలి, ఎప్పుడూ ఏది కావాలన్నా ఇంట్లో ఏమి లేకపోయినా అప్పటికప్పుడు వారికి అందివ్వాలి.
మరో మాట మాట్లాడకూడదు. చేయను అని అనకూడదు. తలనోస్తున్నా, కాళ్లు లాగుతున్నా, జ్వరం వచ్చినా, మనసు బాగొలేకపోయినా, ఏమైనా సరే చిరునవ్వుతో ఉండాలి తప్ప ముక్కుతూ మూలుగుతూ ఉండకూడదు. ఇన్ని చేసినా అన్నిటికీ వంకలు పెడుతూ ప్రతి దానికి సాధిస్తారు. ప్రతి దాన్ని బూతద్దం లో చూసి తప్పంతా నీదే అన్నట్టు నిందలు వేస్తారు.
పశువులను, జీవాలను కంటికి రెప్పలా కాపాడే వారే వాటికి దగ్గర ఉండి తినిపించే వారే కనీసం ఇంట్లో ఉన్న ఆడవారిని తిన్నావా, బాగున్నావా, ఎలా ఉన్నావు అని కూడా అడగరు. అడగాలని ఆశించడం కూడా తప్పే. మేము అడగకపోతే నువ్వు చెప్పొద్దూ అంటూ ఆ నింద కూడా నెత్తిన వేసి తప్పంతా ఆడవారికే అంటగడతారు.
ఏమీ దేవుడా పశువులకున్న స్వేచ్చ ఆడదానికి లేకుండా పోయిందే…. పశువులపై చూపించే ప్రేమ ఆడవారిపై చూపించేదేవరు. అయినా నిన్ను అడగడం కూడా తప్పే, ఎందుకంటే నువ్వూ మగాడివే కదా….
– భవ్య చారు