ముడు ముళ్ళు ఉప్పు కషాయం
పిల్ల బాగానే ఉంది. మాకు నచ్చింది. అన్నయ్య గారు ఇక మిగిలిన వివరాలన్నీ మాట్లాడుకుంటే అయిపోతుంది. అన్నది కళావతి.. అవునవును అంతే అంతే అంటూ చంద్రం గారు వత్తాసు పలికారు.
నరేంద్ర, సుగుణ మొహాలు చూసుకున్నారు. అంటే అంతా వియ్యపురాలుదే ఇంట్లో పెత్తనం ఉన్నట్టు ఒక్క మాట తో తేలిపోయింది.
అది ఒకందుకు మంచిదే ఒకరి మాట పై ఉంట ఆ ఇంట్లో మంచి ఉంటుంది అని అనుకున్నారు. అదేంటంటే మీరు మౌనంగా ఉన్నారు మా అబ్బాయి మీకు నచ్చలేదా ఏమిటి అన్నాడు చంద్రం గారు.
అయ్యో ఎంత మాట నచ్చక పోవడం ఏమిటి అండి భేషుగ్గా నచ్చారు కానివ్వండి మిరెంతలో ఉన్నారో చెప్తే మేము ఆలోచిస్తాం అన్నారు సుగుణ దంపతులు.
ఆ ఏముందండి పెద్దగా మేము మతటం ఏమి అధుతాము ఏదో పదిలక్షలు, పది తులాల బంగారం, ఆడపడుచుల లాంఛనాలు ఎలాగూ ఉంటాయి.
ఇక పోతే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవన్నీ మేము అడగడం లేదు. మీ కూతురు అల్లుడు కోసమే కదా ఆ మాత్రం ఇవ్వలేరా, అన్నారు చంద్రం దంపతులు.
అవన్నీ ఇస్తాం బావగారు కానీ అసలు ఆముఖ్య విషయం ఏమిటో చెప్పండి అన్నారు సుగుణ దంపతులు.
ఏముందంది వాడికి బండి ఉంది అందులో రోజు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అలాగే వారికి వచ్చే నెల కరెంటు బిల్లు, పప్పు ఉప్పులు, గ్యాసు బిల్లులు మాత్రం నెల నెలా మీరే కట్టాలి.
ఇక మా వాడి సంపాదన వారికి పుట్టబోయే పిల్లల స్కూల్ ఫీజు ల కోసం డిపాజిట్ చేస్తూ ఉంటారు.
అదండీ సంగతి నెలవారీ సరుకులు ఇవ్వన్నీ మీకు తెలియనివి కావు కదా… బావగారికి అన్ని తెలుసు అన్నాడు చంద్రం.
అవునవును అన్నయ్య గారు అన్ని అనుభవించిన వారే కదా అంటూ నవ్వుతూ అంది సుగుణ. ఈ మూడుముళ్లు పడక ముందే ఉప్పేసిన కషాయం తాగినట్లు అయ్యింది నరేంద్ర దంపతులకు.
వామ్మో ఇన్ని ఖర్చులు నేను భరించ లేను కానీ అన్నయ్య గారు మీకు మీ సంబంధానికి ఒక దండం అంటూ బయటకు వెళ్ళమన్నట్టు చెయ్యి చూపించారు.
అవునన్నా నేను మూడుముళ్లు వేసుకోను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అంటూ రాజేష్ వైపు చూస్తూ పల్లవి నికేవరు పిల్లని ఇవ్వరు ఇంత గొంతెమ్మ కోరికలూ అంది.
దానికి రాజేష్ నాకు కారుంది దాన్ని ఫుల్ చేయించమని అడగనందుకి సంతోషించింది అంటూ పదండి అని కోపంగా బయటకు నడిచారు.
అలా వారి గొంతెమ్మ కోరికలు తీర్చలేక ఆ మధ్యతరగతి మనిషి నరేంద్ర సోఫాలో నీరసంగా కూలబడి పోయాడు. ఇదండీ మూడు ముళ్లు ఉప్పు కషాయం కథ ఎలా ఉందో చదివి చెప్పండి.
– అర్చన