మోక్షం లేదా
మట్టి బ్రతుకులు మావి చిట్టి బ్రతుకులు…
పట్టెడు మెతుకుల కోసం పొట్టకూటీ కోసం గంపనెత్తిన పెట్టవలసిందే…
ఇల్లు గడవాలంటే నిత్యం పని చేయవలసిందే…
చిన్నారి ఆడపిల్లలం ఆడుకునే వయసు..
బాల్యాన్ని హాయిగా గడపాల్సిన వయసు…
కానీ బీద బ్రతుకులే కాలానికి తలవంచక తప్పలేదే…
తలవంచి బరువు మోయాలిసిందే…
జానెడు పొట్ట కోసం…
బడిలో గడపాల్సిన బాలికలo…
బడి పిల్లలతో చదువుకోవాల్సిన వాళ్ళం…
కానీ దేవుడు ఆ రాతలు మాకు రాయలేదే…
మా బ్రతుకులు బీద బ్రతుకులే…
బరువు మోయ వలసిందే…
బ్రతుకు బండి లాగవలసిందే…. మట్టిలో మాణిక్యాల ఎన్నో….
మట్టిలోనే ఉంటున్నాయి…
మంచి మేలు తలపెట్టే వాడే లేడా…
వాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు కావాల్సిందేనా…
మోక్షం లేదా…
– పలుకూరి