మొగ్గని ప్రేమ
ఓ, మొగ్గా…….!
మొగ్గ వు కదే నీవు
ఆ వరకు నీ పంతం నెగ్గ!
తగ్గ శీలమే నీది,
ఔననుటకు నాకు సిగ్గా!
బుగ్గ మాటున ఉంచితివి,
పూరేకుల అందాలను
విచ్చుకుంటివే చివరకు
భానుడు నీకు తల ఒగ్గ.
ఇప్పుడు రాజ్యాలేలే
నమస్కారము
నీవు నేర్పినదే నే
ఆ సంస్కారము!
మేము నడిమంత్రాన నేర్చినది…….
నీకు అబ్బెను కదనే జన్మతః.
నా చెలి వై రావే…….
నీ లక్షణాలు లక్షల విలువే.
నా దరికి చేర్చవే
నీ వారసత్వాన్ని!
నమస్కారము నీకు…
నేను తగ్గను, ఒగ్గను అప్పటిదాకా.
రాయి ని నేను, రవి ని కాను.
-వాసు