మిత్రుడు
కొన్నాళ్ళ క్రితం నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. అప్పుడే నాకు ట్విట్టర్ గురించి తెలిసింది. అది ఇన్స్టాల్ చేశాక, చాలా అయోమయానికి గురి అయ్యాను ఏదీ నోక్కితే ఏమవుతుందో అనేది తెలియలేదు కానీ రాను రాను తెలుసుకున్నాను. తర్వాత నాకు అనిపించిన ఆలోచనలు రాయడం మొదలు పెట్టాను. అలా ఒకరి తర్వాత ఒకరు గా నాకు ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు.
నేను రాసేవి సమాజానికి దగ్గరగా ఉండడం వలన అందరూ మెచ్చుకుంటూ అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉండేది. కానీ అదే సమయం లో నాకొక మిత్రుడు పరిచయం అయ్యారు. నేను నా ఫోటోలు పెట్టేదాన్ని అయితే అలా ఫోటోలు పెడితే జరిగే చెడు గురించి తను నాకు వివరించి వాటిని తొలగించే వరకు ఊరుకోలేదు.
ఎవరో తెలియని నా గురించి ఇంతలా ఆలోచించే మిత్రుడు దొరకడం అదృష్టం కదా, కాబట్టి తన మాటలు అన్నీ వినేదాన్ని…. అలా మాకు పరిచయం పెరుగుతూ వచ్చింది. అంత పరిచయం పెరిగినా తానెప్పుడూ హద్దు మీరి మాట్లాడలేదు. చాలా గౌరవంగా మాట్లాడేవారు. నాకెన్నో జాగ్రత్తలు చెప్పేవారు. మధ్యలో కొన్ని గొడవలు వేరే వారి వల్ల జరిగాయి అప్పుడు కూడా తను నువ్వెందుకు బాధ పడతావు అంటూ ఓదార్చారు. నీకు నేనున్నాను అన్నారు.
అయితే ఈ విషయం తెలిసిన కొందరు అల్లరి మూకలు మమల్ని ఏదేదో అన్నారు. దాంతో ఇద్దరం బాధ పడ్డాం. అయినా మా స్నేహానికి ఎలాంటి విరామం రాలేదు. తర్వాత కూడా ఎవరెవరు ఏమేం అనుకుంటున్నారు ఎం చేస్తున్నారు దానికి మనమేం చేయాలో అంటూ మాట్లాడుకున్నాం. అలాగే చేస్తున్నాం. ఒక మంచి మిత్రుడు.
ఇప్పటి వరకు ఒకర్నొకరము చూసుకోకపోయినా మనసులు మాట్లాడుకున్నాయి. మా స్నేహం ఇలాగే కొనసాగాలని అతని జీవితం బాగుండాలని అతను సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఎప్పటికైనా నిన్ను చూడాలని కలవాలని నీ ఋణం తీర్చుకోవాలని ఎదురు చూసే నీ నేను ..
– భవ్యచారు