మిత్రోత్సాహం
మితృలతోనే సావాసం
చేయాలండీ నిరంతరం.
మితృలంతా కలసి-మెలసి
ఉండాలండీ నిరంతరం.
మితృలు చేసిన సాయాన్ని
గుర్తుంచుకోవాలి నిరంతరం.
వారితో గడిపిన రోజుల్ని
తలుచుకోవాలి నిరంతరం.
మితృలంటే ఆత్మబంధువులు.
వారే మన హితైషులు.
మితృలకు స్నేహితుల
దినోత్సవ శుభాకాంక్షలు.
-వెంకట భానుప్రసాద్