మిత్రమా తేడా తెలుసుకో
ఆడ- మగ స్నేహంగా
ఉండటంలో తప్పులేదు.
స్నేహ చేయడం అంటే
ప్రేమలో పడటం కాదు.
స్నేహం చేయటానికి, ప్రేమించటానికి మధ్యన ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ తేడా తెలుసుకుంటే ఆ స్నేహితుల
మధ్య మనస్పర్థలు ఉండవు.
చాలా మంది మగవారు తమతో మట్లాడే అడవారు
తమను ప్రేమిస్తున్నారు అనే
భావనలో ఉంటారు. అది చాలా తప్పు. వారు స్నేహంగా
ప్రవర్తిస్తున్నారు అంటే అది
మగవారి పట్ల గౌరవం వల్ల
ఆడవారు వారితో అలా కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండవచ్చు. అంతమాత్రాన
వాళ్ళను బుట్టలో వేసుకోవాలి
అనుకోవటం మగవారి మూర్ఖత్వం. అలా స్నేహంతో మొదలై ప్రేమలో పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా స్నేహం
చేస్తూ ఆ బంధం బలపడి ఆ
తర్వాత ప్రేమగా మారి వివాహం చేసుకున్న వారు
కూడా ఉన్నారు. అది పెళ్ళి
అవకముందు సంగతి. మరి
పెళ్ళయిన తర్వాత కూడా
నచ్చిన ఆడవారితో స్నేహం
చేసి ఆ తర్వాత వారిని ప్రేమలోకి దింపాలని చూసే
ప్రభుద్దులు చాలా మందే ఉంటారు. వారి విషయంలో
ఆడవాళ్లు చాలా అప్రమత్తంగా
ఉండాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని