మిత్రధర్మం
చీకటినుంచి వెలుగుచూడటం
అందమైన దృశ్యం అనుకునే మనిషి
చీకటినుంచి వెలుగులోకి ప్రయాణమంటే
సందేహాల వనమవుతాడు
ఎత్తునుంచి లోయల్ని చూడటమంటే ఉత్సాహపడే మనిషి
నీలోని లోతుల్ని చూడటాన్ని నిరాకరిస్తావు
ఉపరితల స్పర్శతోనే పునీతుడనయ్యాననుకుంటావు
మనిషీ
నీకు ఎత్తుపల్లాల ప్రయాణం ఆనందం
జీవితపు ఎత్తుపల్లాలు భయానకం
మారాలని ఆశించటం మాయ చేయటం కాదు కదా
కాలం పరిహాసాలను పరిహరిస్తావు
గాయాల గుట్టును దాచుకుంటావు
తోడుండే స్నేహితుడిపై తొందరపడతావు
తొలకరి జల్లు కురిపించే మేఘమవ్వాలనటం మిత్రధర్మమే కదా
– సి.యస్.రాంబాబు
రచన బాగుంది.