మీరెళ్తున్న దారులు

మీరెళ్తున్న దారులు

మీరెళ్ళే దారుల్లో •••
ఆత్మీయత కలిసిన
మా పలకరింపు వినిపించలేదా..!?

మీరెళ్ళే దారుల్లో •••
మా వంటి సుగందాలను
కలిపి పంచిన పరిమళాలను ఆస్వాదించలేదా ..!?

మీరెళ్ళే దారుల్లో •••
మా లేత పసి హృదయాల కేరింతలు
మీ చెవిన చేరనేలేదా ..!?

మీరెళ్ళే దారుల్లో •••
మా హృదయాలను తెరిచి
వినమ్రంగా పలికిన
స్వాగత వచనాలను స్వీకరించనే లేదా..!!

మీరెళ్ళే దారుల్లో •••
మా అమాయకపు వందనాల
ముసిముసి నవ్వులు
మీ కంట పడనే లేదా ..!?

మీరెళ్ళే దారుల్లో •••
మా అందాలతో నేసి పరిచిన
తివాచీల వర్ణాలు గుర్తుకే లేదా..!?

మీరెళ్ళే దారుల్లో •••
మా ఊపిర్లతో ఆలపించిన
సంగీత మాధుర్యాన్ని
రుచి చూడనే లేదా..!?

ఇవేవీ నీ దరికి చేరలేదా ..!?
మా ఆతిథ్యాలను గుర్తించే తీరికే లేదా ..!?
ఆలోచించుకో మిత్రమా
మౌనంగా….!!
విమర్శించుకో నేస్తమా
ఒంటరిగా …!!
ఏ గమ్యాన్ని చేరేందుకు
నీ ఈ ఆరాటం
ఏ లక్ష్యాన్ని ముద్దాడేందుకు
నీకీ పోరాటం

ఓ బాటసారి కాసింత ఆగు
చుట్టూరా లోకాన్ని చూడు
సృష్టిలో నువ్వు ఒక్కడివే
అనుకుంటే అంతా అంధకారం
ప్రకృతిలో నువ్వూ ఒకడివే
అనుకున్నంత కాలం ఆనందదాయకం

– తోటి నేస్తాలు

 

-బాణోతు రామానాయక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *