మేడే
కుల మతాలను రెచ్చగొట్టి వాటిని
అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకునే
దొంగ నాయకులకు ఎం తెలుసు.?
నిరంతర శ్రామికుల గొప్పతనం
దేవుడు, దయ్యాల పేరు చెప్పి
ప్రజలని భక్తి ముసుగులో,
భయభ్రాంతులతో ఉంచుతూ
ఎలాంటి శ్రమ చేయకుండా
దోచుకు తినే సోమరిపోతులకు
ఏం తెలుసు..?
కార్మికుల, కర్షకుల గొప్పతనం
నేడు ప్రపంచ దేశాలు
పురోగఅభివృద్ధి సాధిస్తున్నాయంటే..
ప్రగతిపథంలో నడుస్తున్నయంటే..
శ్రామికుల శ్రమ ఫలితమే
రెక్కలు ముక్కలు చేసుకొని తమ
రక్తాన్ని చెమటగా మార్చే
శ్రామికులంతా కలిసి అహర్నిశలు
శ్రమిస్తుంటే కొందరు మాత్రం కోట్లకు
పడగలెత్తుతున్నారు…
అద్దాలమేడలలో విలాసంతమైన
జీవితాన్ని గడుపుతున్నారు…
ఒక రకమైన సామాజిక వర్గాలు
నాయకులుగా ఎదుగుతుంటే…
మరోరకమైనటువంటి
సామాజిక వర్గాలు ఓటర్లుగా
మారుతున్నారు
అలాగే ఒక రకమైనటువంటి
సామాజిక వర్గాలు ఓనర్లుగా
ఎదుగుతుంటే…
మరోరకమైనటువంటి సామాజిక
వర్గాలు కార్మికులుగా, కర్షకులుగా, కూలీలుగా మారుతున్నారు
వ్యవస్థ మారాలి
వ్యవస్థలో మార్పులు రావాలి
శ్రమ చేసే వారికి…
సమాన హోదా
సమాన హక్కు
సమాన వేతనం
సమాన రక్షణ అందించబడాలి…
అందరూ సమానంగా గుర్తించబడాలి
-బొమ్మెన రాజ్ కుమార్
మితృలకు మే డే శుభాకాంక్షలు.
✊✊✊
ప్రపంచ కార్మికులారా
సమస్త శ్రామికులారా
ఏకంకండి ✊✊