మాతృ దినోత్సవం
ఒకటా రెండా తొమ్మిది నెలలు
నీ ప్రేమతో నీలో నన్ను దాచావు
నీ రక్తాన్ని ధారపోసి గుండె నిచ్చావు
నీ శ్వాసతో శ్వాసగా నాకు ఊపిరి ఇచ్చావు
నీ రెప్పల చాటు చీకటిలో నాకు వెలుగు నింపావు
నీ ప్రాణాన్ని అంకితం చేస్తూ నాకు జన్మనిచ్చావు
మాతృమూర్తివై అమ్మగా నా మొదటి పిలుపు అయ్యావు
నన్ను నీ గుండెలకి హత్తుకుని
చిరునవ్వుతో కంటి నిండా ఆనందపు చిరుజల్లులతో నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేశావు
చిన్న చిన్నగా అమ్మ అని పిలిస్తే ఆనందంతో పరవసించావు
బుడి బుడి అడుగులు వేస్తూ పడిపోతే నువ్వు ఎడ్చావు
నా వేలు పట్టుకుని నడవడం నేర్పించావు
గోరు ముద్దలు పెట్టీ నా ఆకలి తీర్చి నీ కడుపు నిండినంత
సంతోషించావు
ఎన్నో రాత్రులు నాకు కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చి నువ్వు మెల్కొన్నావు
నా కొడుకు రాజు అని చెప్పి ఎంతగానో మురిసిపోయావు
అక్షరాలు దిద్దించి నా మొదటి గురువు అయ్యావు
నా జీవిత గమ్యం లో నువ్వు ఎదురు నిలిచి ఎన్నో ముల్లకంపాలపై నువ్వు నడిచి నేను వేసే ప్రతి అడుగు తేలిక చేశావు నన్ను ఒక గమ్యానికి చేర్చావు
అమ్మ నీ ఋణం ఎలా తీర్చుకోాను
వచ్చే జన్మ అంటూ ఉంటే నీ కొడుకుగానే పడతాను
– భరద్వాజ్
అమ్మ ఋణం తీర్చుకోలేనిది. మీ రచన బాగుంది.