మాతృభాషను ప్రేమించండి
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడటం కొందరు మానేశారు. వేరే భాషలకి ఇచ్చిన విలువ తెలుగు భాషకి ఇవ్వడం లేదు. రోజు రోజుకి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు.
మనం మన పిల్లలకి ముందు తరాలకి కూడా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలి. వేరే భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగు భాషను మాత్రం కించపరచకూడదు అని పిల్లలకు చెప్పాలి.
ఏ ఉద్యోగం చేయడానికి వెళ్ళినా కూడా తెలుగు భాష కంటే వేరే భాష వచ్చా అని అడుగుతున్నారు.
ఎందరో మహానుభావులు తెలుగు భాషలో ఎన్నో రచనలు చేశారు.
పద్యాలు , గద్యలు , గేయాలు , కథలు , కవితలు , విప్లవ రచనలు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రచనలు చేశారు.
పుట్టి నుంచి మాట్లాడిన తెలుగు భాషని తల్లితో సమానంగా గౌరవించాలి.
తెలుగు భాషలో మన వాళ్లను ఎంతో ఆప్యాయంగా పిలిస్తే ఆ పిలుపులో మాధుర్యం ఉంటుంది.
అమ్మ,నాన్న,అన్నయ్య, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తుంటే అందులో ఉన్న మాధుర్యత చవిచూసినట్టు ఉంటుంది.
అలాంటి తెలుగు తల్లిని మర్చిపోకూడదు. తెలుగు భాష కోసం ఎంతోమంది సాహిత్య రంగంలో పోరాటం చేస్తున్నారు.
తెలుగు మీద అభిమానం పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.మన వంతుగా కూడా కృషిచేసి తెలుగు భాషను కాపాడుకుందాం.
అమ్మ ప్రేమలో ఎంత మాధుర్యత ఉంటుందో అంతే తీయగా ఉంటుంది తెలుగు భాష.శ్రీకృష్ణదేవరాయలు తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పారు.
మన తెలుగులో సామెతలు,జాతీయాలు వంటివి ఎన్నో ఉన్నాయి. అమ్మలాంటి మాతృభాషను ప్రేమించండి..
జై తెలుగు తల్లి జై తెలుగు భాష..
-మాధవి కాళ్ల